: నిజమైన నీలి విప్లవం తీసుకొస్తాం: కేటీఆర్
గ్రామీణ తెలంగాణ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇందులో భాగంగా గతేడాది 37 కోట్ల చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేసిన సంగతిని ఆయన ట్విట్టర్ ద్వారా గుర్తుచేశారు. అలా చేయడం వల్ల చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగి మత్స్యకారులు లాభాలు గడించారని చెప్పారు. అదేవిధంగా ఈ ఏడాది కూడా 67 కోట్ల చేప పిల్లలను ఉచితంగా పంపిణీ కార్యక్రమం చేపట్టి, తెలంగాణ రాష్ట్రంలో నిజమైన నీలి విప్లవం తీసుకొస్తామని ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.