: టీడీపీది వంటావార్పుల ప్లీనరీ.. మాది అలా కాదు: భూమన
అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా, అమలు చేయలేని హామీలను ఇచ్చి టీడీపీ అధికారంలోకి వచ్చిందని... ఆ పార్టీని ఎండగడుతూ, ప్రజల పక్షాన వైసీపీ పోరాడుతోందని ఆ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ప్రజల సంక్షేమం కోసం వైసీపీ ఎంత నిబద్ధతతో ఉందో, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు తమ పార్టీ ఎంత కృత నిశ్చయంతో ఉందో ప్లీనరీలో చెబుతామని అన్నారు. టీడీపీది వంటావార్పుల ప్లీనరీ అయితే, తమది మాత్రం ప్రజల ఆశయసాధనకు కృషి చేసే ప్లీనరీ అని చెప్పారు. 18 కీలక అంశాలపై ప్లీనరీలో చర్చిస్తామని తెలిపారు. మరో కీలక నేత వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, రాబోయే రెండేళ్లలో ఎలా ముందుకు వెళ్లాలనే విషయంపై కార్యకర్తలకు ఈ ప్లీనరీలో దిశానిర్దేశం చేస్తామని వెల్లడించారు.