: పొద్దున్న లేచి ఏదనిపిస్తే అది చేస్తాను... ప్లాన్ చేసుకోవడం నావల్ల కాదు: జూనియర్ ఎన్టీఆర్


తాను ప్లాన్డ్ గా ఉండే వ్యక్తిని కాదని జూనియర్ ఎన్టీఆర్ తెలిపాడు. బిగ్ బాస్ షోలో ఎలా వ్యవహరించాలి అన్నదాని గురించి ఇంకా ఏమీ ఆలోచించలేదని అన్నాడు. పొద్దున్న లేచిన తరువాత ఏదనిపిస్తే అదే చేస్తానని... ప్రతీదీ ప్లాన్ చేసుకుని ఉండడం తనవల్ల కాదని తారక్ తెలిపాడు. బట్టలు కూడా ఏవి నచ్చితే అవే వేసుకుంటానని, ఈ మధ్య తన డిజైనర్ 'మీరివే వేసుకోవాలి' అని చెబుతుండడంతో తప్పడం లేదని చెప్పాడు. పాజిటివ్ అంశాల కంటే నెగిటివ్ అంశాల పట్ల ఎక్కువ మంది ఆకర్షితులవుతారని అన్నాడు. అందుకే బిగ్ బాస్ ఎక్కువ సక్సెస్ అయిందేమోననే అనుమానం వ్యక్తం చేశాడు. అయితే ప్రతి నెగిటివ్ అంశం వెనుక పాజిటివ్ దృక్పథం ఉంటుందని తెలిపాడు. అదే తనను ఆకర్షిస్తుందని తెలిపాడు. 

  • Loading...

More Telugu News