: రేపిస్ట్‌ను పట్టుకోవడానికి ఫేస్‌బుక్‌లో అతని ఫోటోను పోస్ట్ చేసిన పోలీసులు... దానిపై కామెంట్ చేసిన రేపిస్ట్!
కిడ్నాప్, రేప్ నేరానికి పాల్పడి పరారీలో ఉన్న ఓ నేరస్థుడిని పట్టుకోవడానికి వాషింగ్టన్‌లోని నార్త్ కరోలినా పోలీసులు ఫేస్‌బుక్‌ను ఉపయోగించారు. రేపిస్ట్ డెరెక్ లీ హెమ్స్ ఫొటోతో పాటు అతని వివరాలను తెలియజేస్తూ, ఎక్కడైనా కనిపిస్తే వెంటనే సమాచారం అందివ్వాలని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. నేరస్థునికి వ్యక్తిగతంగా పరిచయమున్న ఒక వ్యక్తి `ఇతను అలాంటి వాడు కాదు.. చాలా మంచివాడు` అని కామెంట్ చేశాడు. దానికి రిప్లైగా స్వయంగా నేరస్థుడే `థ్యాంక్యూ బ్రదర్.. త్వరలో నిజం బయటపడుతుంది` అని కామెంట్ చేశాడు. ఆ కామెంట్ చూసి పోలీసులు షాకయ్యారు. `నువ్వు ఎక్కడున్నా సరే.. త్వరగా లొంగిపో` అంటూ మళ్లీ కామెంట్ చేశారు.