: అద్దంకిలో ఉద్రిక్తత... కరణం బలరాం, గొట్టిపాటి రవి వర్గాల మధ్య మరో వివాదం!
ప్రకాశం జిల్లా అద్దంకిలో ఉద్రిక్తత ఏర్పడింది. అద్దంకిలోని సీసీ రోడ్డు శంకుస్థాపన సందర్భంగా ఈ వివాదం రాజుకుంది. ఒకే రోడ్డుకు కరణం బలరాం, ఎమ్మెల్యే గొట్టిపాటి రవి వర్గీయులు పోటాపోటీగా రెండు శిలాఫలకాలు ఏర్పాటు చేశారు. ఈ రెండు శిలా ఫలకాలకు ఒకే సమయంలో శంకుస్థాపన ముహూర్తం పెట్టారు. దీంతో రెండు వర్గాలకు చెందిన కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో రెండు వర్గాల కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో వారి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు చోటుచేసుకోగా పోలీసులు రెండు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నంలో ఉన్నారు.