: ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడ్డ జవాన్లు
జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు పంజా విసిరారు. బందీపోరా జిల్లాలో ఆర్మీ జవాన్లను లక్ష్యం చేసుకుని ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. గాయపడ్డ జవాన్లను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. మరోవైపు కశ్మీర్ లో హైఅలెర్ట్ ప్రకటించారు. హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీ ప్రధమ వర్ధంతి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తమైంది.