: బ్రాహ్మణ కుర్రాడి గెటప్‌లో అల్లు అర్జున్ అదరగొట్టాడు: జూనియర్ ఎన్టీఆర్ కితాబు


ఇటీవల విడుదలైన ‘డీజే: దువ్వాడ జగన్నాథం’ చిత్రంపై బన్నీ అభిమానులు, ప్రేక్షకులు,‘మెగా’ కుటుంబం.. ఇలా చాలామంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయితే, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ చిత్రంపై తన కామెంట్ చేశాడు. ముఖ్యంగా, స్టైలిష్ స్టార్ బన్నీ నటన, ఈ చిత్ర దర్శకుడు హరీశ్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కించిన విధానంపై ఆయన ప్రశంసలు కురిపించారు.

డీజేలో బ్రాహ్మణ కుర్రాడి గెటప్ లో అల్లు అర్జున్ అదిరిపోయాడని, డైలాగ్స్ చెప్పిన తీరు కూడా బాగుందంటూ తోటి హీరోను జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసించాడు. ‘అదుర్స్’ చిత్రంలో తన రూపు రేఖలను, బాడీ లాంగ్వేజ్ ను చిత్ర కథకు అనుగుణంగా మార్చిన హరీశ్ శంకర్ ప్రతిభ గురించి తనకు తెలుసని అన్నారు. కాగా, ‘డీజే’లో అల్లు అర్జున్ నటనపై తారక్ ప్రశంసలు కురిపించడంపై బన్నీ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.  

  • Loading...

More Telugu News