: ‘స్త్రీలను కించపర్చారు’... బీజేపీ నాయకురాలు పోస్ట్ చేసిన ఆ ఫొటోపై నెటిజన్ల మండిపాటు!
పశ్చిమ బెంగాల్‌లో హిందువుల పట్ల తృణమూల్ కాంగ్రెస్ సర్కారు ఇలా ప్రవర్తిస్తోందంటూ హర్యానా బీజేపీ నాయకురాలు విజేత మాలిక్ తన ఫేస్ బుక్ పేజీలో ఓ ఫొటో పోస్ట్ చేసి అలజడి రేపారు. ఓ మహిళ చీరను రౌడీ లాగుతూ ఉన్న భోజ్‌పురి సినిమా ‘ఔరత్ ఖిలోనా నహీ’లోని ఒక ఫోటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. హిందువుల పరిస్థితి ఇలా ఉందని పేర్కొన్న ఆమె, హిందువులనే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారని అడిగారు.
హిందువులను ఇలా బహిరంగంగానే వేధిస్తున్నారని ఆమె రాసుకొచ్చారు. హిందువులపై ఓ వైపు దాడులు జరుగుతోంటే మరోవైపు మమతా బెనర్జీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆమె పేర్కొన్నారు. అయితే, ఇటువంటి ఫొటో పోస్ట్ చేసిన విజేత మాలిక్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యకు పాల్పడ్డ ఆమెను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆమె స్త్రీలను కించపర్చారని నెటిజన్లు అంటున్నారు.