: ‘జెఎఫ్‌డబ్ల్యు’ కవర్‌పేజీపై హీరోయిన్ సమంత అందాల ఫొటో!
ప్రముఖ మహిళల పత్రిక జస్ట్ ఫర్ విమెన్ (జెఎఫ్‌డబ్ల్యు) కవర్‌పేజీపై చెన్నై బ్యూటీ సమంత ఫొటోను ప్రచురించారు. ఇందులో సమంత చేనేత వస్త్రాల్లో కనపడుతూ అందాలను ఆరబోసింది. ఆ మ్యాగజీన్ కవర్ ఫొటోపై ఈ అమ్మడుని చూస్తోన్న అభిమానులు ఆమె అందాలకు ఫిదా అయిపోతున్నారు. ఈ ఫొటోను సమంత తన ట్విట్టర్ ఖాతాలో రీట్వీట్ చేసింది. త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్న ఈ అమ్మడు ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉంది. ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం తనకు సంబంధించిన ఫొటోలు పోస్టు చేస్తూనే ఉంటుంది. తన ఫ్యాన్స్ చేస్తోన్న పలు ట్వీట్లకు రిప్లై ఇస్తూనే ఉంటుంది.