: హైదరాబాద్ లో భారీ వర్షం.. ట్రాఫిక్ జామ్


హైదరాబాద్ నగరంలో ఈ రోజు కూడా ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షం కురుస్తోంది. దీంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. న‌గ‌రంలోని పంజాగుట్ట‌, ఎస్సార్‌న‌గ‌ర్‌, యూస‌ఫ్‌గూడ‌, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, నల్లకుంట, విద్యానగర్, తార్నాక‌, ఓయూ, అంబర్ పేటల‌తో పాటు మేడ్చల్ జిల్లాలోని ప‌లు చోట్ల వ‌ర్షం కురిసింది. కొన్ని చోట్ల భారీ వ‌ర్షం కుర‌వ‌గా, మ‌రికొన్ని చోట్ల ఓ మోస్త‌రు వ‌ర్షం ప‌డింది. వ‌ర్షం కార‌ణంగా కొన్ని ప్రాంతాల్లో వాహ‌న‌ రాక‌పోక‌లకు ఇబ్బంది క‌లిగింది.   

  • Loading...

More Telugu News