: వరుసగా టాస్‌లు ఓడిపోయిన నాలుగో భారత కెప్టెన్ విరాట్
మ్యాచ్ గెలవడంలో అదృష్టాన్ని జేబులో పెట్టుకుని తిరిగే భారత జట్టు కెప్టెన్ విరాట్ కొహ్లీకి టాస్ గెలవడం విషయంలో మాత్రం చేదు అనుభవాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా వన్డే ఇంటర్నేషనల్ మ్యాచుల్లో విరాట్ వరుసగా టాస్ ఓడిపోతూనే ఉన్నాడు. ఇలా వన్డేల్లో వరుసగా టాస్ ఓడిపోయిన భారత కెప్టెన్లలో విరాట్ నాలుగో వాడు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన వన్డేల్లో భారత్ విజయం సాధించడాన్ని పక్కన పెడితే, విరాట్ ఒక్క మ్యాచ్‌లో కూడా టాస్ గెలవలేదు.
ఇప్పటివరకు విరాట్ నాయకత్వం వహించిన 30 వన్డేల్లో కేవలం 13 మ్యాచుల్లో మాత్రమే టాస్ గెలిచాడు. ధోని నాయకత్వం వహించిన సమయంలో 199 వన్డేల్లో 97 టాస్‌లు గెలిచాడు. 2011లో ఇంగ్లండ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ధోని కూడా వరుసగా టాస్ ఓడిపోయాడు. జింబాబ్వేతో జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో అప్పటి కెప్టెన్ అజింక్య రహానే కూడా వరుసగా టాస్ ఓడిపోయాడు. ఈ వరుసగా టాస్ ఓడిపోయే పరంపరను మొదలు పెట్టింది సునీల్ గవాస్కర్. 1984-85లో ఆస్ట్రేలియాతో ఆడిన వన్డేల్లో సునీల్ వరుసగా టాస్ ఓడిపోయాడు.