: ధోనీ గురించి మేము చెప్పడానికి ఏమీ లేదు.. ఎప్పుడు రిటైర్ కావాలో అతనికి తెలుసు: కోహ్లీ
నిన్న వెస్టిండీస్ తో జరిగిన వన్డే మ్యాచ్ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతుండగా.. కోహ్లీకి ఊహించని ప్రశ్న ఎదురైంది. ధోనీ రిటైర్మెంట్ ఎప్పుడు ఉంటుందని ఓ జర్నలిస్టు అడిగాడు. దీంతో కోహ్లీ ఓ క్షణం ఆలోచనలో పడ్డాడు. ఆ తర్వాత మాట్లాడుతూ, ధోనీ గురించి తాము చెప్పడానికి ఏమీ లేదని... ఎప్పుడు రిటైర్ కావాలనేది ధోనీకే తెలుసని చెప్పాడు. టీమిండియా అత్యంత సక్సెస్ ఫుల్ కెప్టెన్ ధోనీ అని కొనియాడాడు. ఇప్పటికీ బంతిని ధోనీ చక్కగా స్ట్రైక్ చేస్తున్నాడని తెలిపాడు. మ్యాచ్ పరిస్థితులను బట్టి ధోనీ ఆడతాడని... ఇన్నింగ్స్ ను ఎలా నిర్మించాలో ధోనీకి తెలుసని చెప్పాడు.