: విజయ్ మాల్యా కేసులో 2 వేల పేజీల సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టిన భారత్.... చీవాట్లు పెట్టిన లండన్ జడ్జి
భారత బ్యాంకుల్లో అప్పులు చేసి విదేశాల్లో తలదాచుకుంటున్న కింగ్‌ఫిషర్ అధినేత విజయ్ మాల్యాను మన దేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు బాగానే జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన కేసు విచారణ గురువారం లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ కోర్టులో జరిగింది. భారత్ పిటిషన్‌కు మద్ధతుగా విజయ్ మాల్యా గురించి 2030 పేజీల రుజువు పత్రాలను సమర్పించారు. సాక్ష్యం పరిమాణాన్ని చూసిన జడ్జి ఎమ్మా ఆర్బుత్నాట్ కంగుతిన్నారు. బ్రిటిష్ కోర్టులు పరిమాణం కంటే స్పష్టతకు, క్లుప్తతకు ప్రాధాన్యాన్ని ఇస్తాయి. దీంతో జడ్జి ఆ విషయాన్ని వివరించి, వీలైనంత త్వరగా 2030 పేజీల సాక్ష్యాధారాలను 30 నుంచి 35 పేజీలకు కుదించాలని చీవాట్లు పెట్టారు. తర్వాతి విచారణ డిసెంబర్ 4న జరగనుంది.