: భారత్‌లో ‘మెర్సిడెస్ బెంజ్’ రికార్డు స్థాయిలో అమ్మకాలు
భారత్‌లో లగ్జరీ కార్ల ఉత్పత్తుల సంస్థ మెర్సిడెస్ బెంజ్ రికార్డు స్థాయిలో అమ్మకాలు సాధించింది. జర్మనీకి చెందిన ఈ కంపెనీ ఏప్రిల్ - జూన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలతో 18 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సదరు కంపెనీ ఇండియాలో 2,975 వాహనాలను విక్రయించింది. ఈసారి ఆ సంఖ్య 3,521గా నమోదైంది. ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ... ఇండియాలో లగ్జరీ కార్ల మార్కెట్‌లో తాము మొదటిస్థానాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. రాబోయే త్రైమాసికాల్లోనూ తమ జోరు కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశారు.