: మంద కృష్ణ తెలంగాణలో ఉంటూ.. ఏపీలో సభలు పెట్టడమేంటి?: చినరాజప్ప
వైసీపీ అధినేత జగన్ సూచనల మేరకే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణలు పని చేస్తున్నారని ఏపీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. వీరిద్దరి కార్యకలాపాల వెనుక అసలైన సూత్రధారి జగనే అని అన్నారు. ఎమ్మార్పీఎస్ నిర్వహించనున్న కురుక్షేత్ర సభకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. పాదయాత్ర కోసం ముద్రగడ ఇంతవరకు అనుమతి తీసుకోలేదని చెప్పారు. అనుమతి కోరితే భద్రత కల్పించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. మంద కృష్ణ తెలంగాణలో ఉంటూ ఏపీలో సభలు పెట్టడం ఏమిటంటూ మండిపడ్డారు. సమస్యలు ఏమైనా ఉంటే ముఖ్యమంత్రితో చర్చించి, పరిష్కరించుకోవచ్చని సూచించారు.