: డ్రగ్స్ దందా అరాచకం... మత్తు కోసం తన నగ్న దృశ్యాలు పంపిన యువతి
హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ దందాను యథేచ్ఛగా సాగిస్తూ, ఎందరో చిన్నారులను మత్తు మందులకు బానిసలను చేసిన దుర్మార్గులు సాగించిన దాష్టీకాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లలో వందల కొద్దీ వాట్స్ యాప్ గ్రూపులుండగా, వాటిల్లోని విషయాలు పోలీసులనే షాకింగ్ కు గురి చేస్తున్నాయి.
ఈ క్రమంలో ఓ గ్రూప్ లోని వీడియో ఒకటి ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ఓ యువతి, తనకు మత్తుమందులు కావాలని కోరుతూ, డబ్బులు లేవని, తన నగ్న వీడియో పంపుతున్నానని, వాటిని ఎవరికైనా విక్రయించి, ఆ వచ్చిన డబ్బుకు ఎంత వస్తే అంత మత్తుమందు ఇవ్వాలని కోరిన మెసేజ్ ని చూసి పోలీసు ఉన్నతాధికారులు కంగుతిన్నారు. డ్రగ్స్ కు బానిసలుగా వేలాది మంది మారిపోయారని, పెద్ద పెద్ద హోటళ్లు, ఐటీ కంపెనీలు, చిత్ర పరిశ్రమల్లోని వ్యక్తులు సైతం కస్టమర్లుగా ఉన్నారని, ఇది చాలా పెద్ద కేసని ఎక్సైజ్ ఎన్ ఫౌర్స్ మెంట్ డైరెక్టరేట్ అకున్ సబర్వాల్ వెల్లడించారు.