: బెట్టింగ్ ఎవరూ చేయవద్దంటూ సెల్ఫీ వీడియో తీసి, యువకుడి ఆత్మహత్య
బెట్టింగులకు ఎవరూ పాల్పడవద్దంటూ సూచిస్తూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పరిధిలోని శంకర్ పల్లిలో విజయ్ అనే యువకుడు బెట్టింగ్ లు చేస్తూ అప్పులపాలయ్యాడు. అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సందర్భంగా విజయ్ ఒక సెల్ఫీ వీడియోను రికార్డు చేశాడు. తన చావుకు కారణం బెట్టింగ్ అని అందులో స్పష్టంగా తెలిపాడు. బెట్టింగ్ లకు ఎవరూ పాల్పడవద్దని సూచించాడు. ప్రధానంగా తన అన్నలు, మామలు, ఇతర కుటుంబ సభ్యులను బెట్టింగ్ కు పాల్పడవద్దని, బెట్టింగ్ వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని వారికి తెలిపాడు.