: డోన్ సింగిల్ విండో చైర్మన్ పదవి టీడీపీ కైవసం


కర్నూలు జిల్లా డోన్ సింగిల్ విండో చైర్మన్ పదవికి ఈరోజు జరిగిన ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్థి వాణిశ్రీ గెలుపొందారు. కాంగ్రెస్‌ అభ్యర్థి తిమ్మారెడ్డిపై 9 ఓట్ల తేడాతో ఆమె విజయం సాధించారు. కర్నూలు జిల్లా కొండపేటలోని సహకార సంఘం కార్యాలయంలో ఉపఎన్నిక నిర్వహించారు. కాగా, గతంలో సింగిల్‌ విండో చైర్మన్‌గా ఉన్న గోపాల్ రెడ్డికి జీవితఖైదు పడటంతో ఆయన ఈ పదవి కోల్పోవాల్సి వచ్చింది. దీంతో, తాత్కాలిక చైర్మన్‌గా వాణిశ్రీని ఎన్నుకున్నారు. సింగిల్ విండో చైర్మన్ పదవికి ఎన్నిక నిమిత్తం నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఈ రోజు ఉపఎన్నిక నిర్వహించగా వాణిశ్రీ విజయం సాధించారు.

  • Loading...

More Telugu News