: హైదరాబాద్ లో దారుణం.. అప్పు తీర్చడం లేదని చితక్కొట్టిన వడ్డీ వ్యాపారులు


త‌మవ‌ద్ద తీసుకున్న అప్పు తిరిగి చెల్లించ‌డంలో జాప్యం చేస్తున్నాడంటూ ఓ వ్య‌క్తిని వ‌డ్డీ వ్యాపారులు దారుణంగా కొట్టిన ఘ‌ట‌న హైదరాబాద్ శివారులోని సరూర్‌నగర్‌లో అల‌జ‌డి రేపింది. డాక్టర్స్‌ కాలనీలో జయశంకర్‌ అనే వ్యక్తి ఇంటికి వ‌చ్చిన‌ ఫైనాన్షియర్లు ఆయ‌న‌ను దూషిస్తూ పిడిగుద్దులు కురిపించారు. స్థానికులు కూడా వారిని ఆప‌డానికి ముందుకు రాలేదు. నడిరోడ్డుపైనే ఈ దాడి జ‌రుగుతుండ‌గా తీసిన ఓ వీడియో మీడియాకు చిక్కింది. అందులో ఫైనాన్షియ‌ర్లు నలుగురు క‌లిసి త‌న‌పై దాడి చేస్తుండ‌గా బాధితుడు త‌న్నులు తిన‌డం త‌ప్ప ఏమీ చేయ‌లేక‌పోయాడు. బాధితుడి పేరు జయశంకర్‌ అని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.   

  • Loading...

More Telugu News