: మధుర జ్ఞాపకం: తమ ఎంగేజ్‌మెంట్ నాటి ఫోటోను పోస్ట్ చేసిన ఉపాసన!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తన ఎంగేజ్‌మెంట్ నాటి మధుర క్షణాలను ఫేస్‌బుక్ వేదికగా ఉపాసన నేడు గుర్తుచేసుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె వారి ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన పాత ఫొటో ఒకటి పోస్ట్ చేశారు. `మా ఎంగేజ్‌మెంట్ ఎంత సరదాగా జరిగిందో.. చాలా రోజులకు దొరికింది ఈ ఫొటో` అని పోస్ట్ చేశారు ఉపాసన. ఈ ఫొటోని ఇప్పటికి వేలాది మంది లైక్ చేశారు. క్యూట్ కపుల్, బాగుంది, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.