: సెల్ఫీ మరణాల్లో ప్రపంచంలోనే ఇండియాకి మొదటిస్థానం!
ప్రమాదకర ప్రదేశాల్లో, క్రూర జంతువుల వద్ద సెల్ఫీలు తీసుకుంటూ ప్రాణాలు కోల్పోతున్న యువత ఏ దేశాల్లో ఎక్కువగా ఉన్నారనే అంశంపై కార్నెగీ మిలన్ వర్సిటీ, ఢిల్లీలోని ఇంద్రప్రస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పరిశోధన చేసింది. మి, మై సెల్ఫ్ అండ్ మై కిల్ఫీ పేరుతో చేసిన ఈ పరిశోధన ఫలితంగా భారత్‌లోనే అత్యధికమంది సెల్ఫీ మోజులో ప్రాణాలు కోల్పోతున్నట్లు తేలింది. మార్చి 2014 నుంచి సెప్టెంబర్ 2016 వరకు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 127 మంది సెల్ఫీ కారణంగా మృత్యు ఒడికి చేరారని తేలింది. అందులో 76 సెల్ఫీ మరణాలు భారత్‌లోనే చోటు చేసుకున్నాయి. ప్రమాదకర ప్రాంతాల్లో సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అత్యధికంగా లైకులు, కామెంట్లు వస్తాయని యువత ఇటువంటి ఘటనలకు పాల్పడుతోంది. స్మార్ట్‌ఫోన్‌లలో పెరిగిన సెల్ఫీల క్వాలిటీ యువతను సెల్ఫీల వైపు మరింతగా ఆకర్షిస్తోంది.