: ఏపీలో జుర్రేస్తున్నారు... 4 రోజుల్లో రూ. 200 కోట్ల మద్యం అమ్మకాలు... ఇదే ఆల్ టైం రికార్డు


మద్యం దుకాణాల లైసెన్సుల రెన్యువల్ కోసం ఎన్నో షాపులు వేచి చూస్తున్న వేళ, ఏపీలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గడచిన నాలుగు రోజుల వ్యవధిలో పలు షాపులు మూతబడివున్నా, జాతీయ రహదారులపై దుకాణాలు తెరచుకోకున్నా, రూ. 200 కోట్ల విలువైన అమ్మకాలు సాగాయి. సోమవారం నాడు రూ. 75.01 కోట్లు, మంగళవారం నాడు రూ. 58.82 కోట్ల విలువైన అమ్మకాలు సాగాయని ఏపీ బ్రీవరీస్ కార్పొరేషన్ ప్రకటించింది.

సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం కానీ, జనావాసాల మధ్య మద్యం దుకాణాలు వద్దని మహిళలు చేస్తున్న నిరసనలుగానీ అమ్మకాలకు అడ్డు కాలేదని ఓ అధికారి వ్యాఖ్యానించారు. రాష్ట్ర రహదారులను మేజర్ జిల్లా రోడ్లుగా మారుస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసినందుకు అత్యధిక వైన్స్ షాపులను మార్చాల్సిన అవసరం లేకుండా పోయిందని ఆయన అన్నారు. ఇదే సమయంలో బెల్టు దుకాణాల సంఖ్య గణనీయంగా పెరగడం కూడా రికార్డు అమ్మకాలకు కారణమైందన్నారు. కాగా, బెల్టు షాపులను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని, అందువల్లే మద్యం అమ్మకాలు పెరిగాయని ఐద్వా జనరల్ సెక్రటరీ డీ రమాదేవి ఆరోపించారు.

  • Loading...

More Telugu News