: సంప్రదాయాన్ని బద్దలు కొట్టిన చర్చ్ ఫాదర్... సోషల్ మీడియాలో వైరల్ వీడియో!
క్రైస్తవుల్లో రోమన్ క్యాథలిక్కు చర్చ్ ఫాదర్ కావాలంటే చాలా కష్టం...12 నుంచి 15 ఏళ్ల ట్రైనింగ్ అనంతరం చర్చ్ ఫాదర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో నిబంధనలకు లోబడి 8 ఏళ్లు ఆటపాటల్లో చురుగ్గా ఉండవచ్చు. ఆ తరువాత వారికి అంత సమయం చిక్కదు. దానితో పాటు వివిధ నిబంధనల కారణంగా వారి వ్యక్తిగత ఇష్టాలను విడిచిపెట్టేస్తారు. ఫాదర్ గా పట్టాభిషేకంకి ముందు ఒక ఏడాది పాటు వారికి అంగీ ధరించే అవకాశం కలుగుతుంది. అప్పటి నుంచి అన్ని వ్యక్తిగత కార్యక్రమాలకు దూరంగా ఉంటారు.
ఈ నేపథ్యంలో కేరళలోని ఒక చర్చ్ ఫాదర్ సంప్రదాయాన్ని బద్దలు కొట్టారు. యూత్ తో కలిసి ఫాదర్ గారు అదరిపోయే స్టెప్పులేసి శభాష్ అనిపించారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను సోషల్ మీడియాలో ఔత్సాహికుడు పెట్టడంతో ఫాదర్ టాలెంట్ అందరికీ తెలిసిపోయింది. సోషల్ మీడియాలో ఫాదర్ డాన్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఫాదర్ సూపర్ డాన్స్ ను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.