: డ్రగ్స్ దందాలో సినీ ప్రముఖుడి అరెస్ట్!
హైదరాబాద్ లో సంచలనం కలిగిస్తున్న డ్రగ్స్ దందాలో పోలీసులు మరింత మందిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా అరెస్టయిన వారిలో తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖుడు ఉన్నట్టు తెలుస్తోంది. అతనితో పాటు దీపక్, అబ్దుల్ అనే ఇద్దరిని ప్రత్యేక దర్యాప్తు బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. వీరి నుంచి 16 డోసుల ఎల్ఎస్డీ మాదక ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసు వర్గాలు సమాచారమిచ్చాయి. తాజా అరెస్టులతో ఈ కేసులో మొత్తం 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లయింది. కాగా, ప్రస్తుతం సదరు సినీ ప్రముఖుడిని పోలీసులు విచారిస్తున్నారు. ఆయన ప్రమేయంపై మరిన్ని ఆధారాలు సేకరించిన తరువాత వివరాలు మీడియాకు వెల్లడించాలని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.