: మహిళలపై సంచలన వ్యాఖ్యలు చేసిన మలయాళ సినీ సీనియర్ నటుడు.. విమర్శలు!
మలయాళ చిత్రపరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదంటూ సీనియర్ నటుడు, ఎంపీ, మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (అమ్మ) అధ్యక్షుడు ఇన్నోసెంట్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ, మలయాళ చిత్రపరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ సంప్రదాయం లేదని అన్నారు. గతంలో పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉందని చెప్పిన ఆయన, అలాంటి సంప్రదాయం మలయాళ చిత్రపరిశ్రమలో లేదని స్పష్టం చేశారు.
ఒకవేళ ఎవరైనా మహిళల పట్ల చెడుగా వ్యవహరిస్తే వెంటనే మీడియాకు తెలిసిపోతుందని ఆయన చెప్పారు. అయితే ఎవరైనా మహిళలు చెడ్డవారైతే కనుక ఏమీ చేయలేమని ఆయన పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలపై 'వుమెన్ ఇన్ సినిమా కలెక్టివ్' (డబ్ల్యూసీసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. చిత్రపరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదన్న విషయాన్ని తాము అంగీకరించమని, పార్వతి, లక్ష్మీరాయ్ వంటి సహచర నటీమణులు బాహాటంగానే కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారని వారు గుర్తు చేశారు.