: భూటాన్ భూభాగం నుంచి మీరు దయచేస్తే మంచిది.. మేం బెదిరింపులకు భయపడే రకం కాదు!: చైనాకు స్పష్టం చేసిన భారత్!


చైనా హెచ్చరికలకు, బెదరింపులకు భయపడేది లేదని భారత్ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గి సరిహద్దులో పూర్వ స్థితి నెలకొనాలంటే భూటన్ త్రికూడలి నుంచి చైనా వెనక్కి తగ్గాల్సిందేనని తేల్చి చెప్పింది. సమస్యను దౌత్య పరంగా పరిష్కరించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రక్షణ శాఖ సహాయమంత్రి సుభాష్ భమ్రే తెలిపారు. ‘‘చైనా బలగాలు గతంలో ఎక్కడ ఉండేవో తిరిగి అక్కడికే వెళ్లిపోవాలి. అవి భూటాన్ భూభాగంలోకి చొరబడ్డాయి. భద్రతా పరంగా ఇది మాకు ఆందోళన కలిగించే విషయం’’ అని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా భూటాన్ వెలిబుచ్చిన ఆందోళనను ఆయన పేర్కొన్నారు. భూటాన్ భూభాగంలో చైనా రోడ్డు నిర్మిస్తోందని, ఇది ఒప్పందాలను ఉల్లంఘించడమే అవుతుందని అన్నారు. భూటాన్ ఆందోళనను తాము అర్థం చేసుకున్నామని, దౌత్యస్థాయిలో చర్చల ద్వారా మాత్రమే ప్రస్తుత సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన వివరించారు. చైనా రాయబారి లువో ఝాహౌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గాలంటే భారత్ తన బలగాలను ఎటువంటి ముందస్తు షరతులు లేకుండా వెనక్కి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారత్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

  • Loading...

More Telugu News