: కోలీవుడ్ చేపట్టిన ఆందోళనకు రజనీ మద్దతుపై కమల్ హర్షం


జీఎస్టీ అమల్లోకి వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం అదనంగా విధిస్తున్న 30 శాతం పన్నును నిరసిస్తూ తమిళనాడు సినీ పరిశ్రమ చేపట్టిన ఆందోళనకు సూపర్ స్టార్ రజనీకాంత్ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విలక్షణ నటుడు కమలహాసన్ తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ .. జీఎస్టీ గురించి రజనీ మాట్లాడినందుకు తన ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. జీఎస్టీపై తమిళ ప్రభుత్వానికి ఓ జెంటిల్ మెన్ గా ముందుగా విఙ్ఞప్తి చేద్దామని, దానిని బట్టి ఆ తర్వాత ఓ నిర్ణయం తీసుకుందామని పేర్కొన్నారు. కాగా, తమిళ చిత్ర పరిశ్రమలో లక్షలాది ప్రజల గురించి ఆలోచించి తమ విఙ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని అక్కడి ప్రభుత్వాన్ని తన ట్వీట్ లో రజనీ కోరడం జరిగింది.

  • Loading...

More Telugu News