: యూట్యూబ్లో స్పైడర్కు లక్ష సబ్స్క్రైబర్లు!
కొన్ని సినిమాలు విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తాయి. ఇక ప్రిన్స్ మహేశ్ బాబు సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అభిమానుల విషయంలో మహేశ్ నిజంగానే శ్రీమంతుడని మరోసారి రుజువైంది. మహేశ్ బాబు హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `స్పైడర్` సినిమాకు చెందిన యూట్యూబ్ ఛానల్ను ఇప్పటికే లక్ష మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. కేవలం ఫస్ట్ లుక్, టీజర్లు మాత్రమే విడుదలైన ఈ సినిమాకు ఇప్పుడే ఇంత క్రేజ్ ఉందంటే ఇక ఆడియో, సినిమా రిలీజ్ సమయానికి ఇంకెంత క్రేజ్ పెరుగుతుందో చూడాలి. మహేశ్ గూఢచారిగా నటిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోంది.