: ఏడేళ్ల బాలుడు... 8 ప్యాక్ వీరుడు!
హీరోలను చూసి ఆ మధ్య సిక్స్ ప్యాక్ బాడీ కోసం చాలా మంది ప్రయత్నించారు. పూర్తి అంకితభావంతో జిమ్ లో వర్కౌట్స్ చేసిన వాళ్లు మాత్రమే అలాంటి బాడీని సాధించగలిగారు. ఈ చైనా కుర్రాడు కూడా జిమ్నాస్ట్గా ఎదగడం కోసం ఎంతో అంకితభావంతో శ్రమించాడు. ఎట్టకేలకు ఏడున్నరేళ్లకే 8 ప్యాక్ బాడీ సంపాదించాడు. అంతేకాకుండా హంగ్జూలో జరిగిన జిమ్నాస్టిక్స్ పోటీలో ఆరు బంగారు పతకాలు, ఒక వెండి పతకం సాధించాడు. ఈ బుడతడి పేరు చెన్ యీ. చైనాలోని హంగ్జూ ప్రాంతంలో ఉంటాడు. సాధించిన పతకాలు మెళ్లో వేసుకుని పోజులిచ్చిన ఫొటోలను చూసి నెటిజన్లు అబ్బురపడుతున్నారు. `ఏడున్నరేళ్లకే 8 ప్యాక్ బాడీ.. బాగా కష్టపడ్డావ్... ఆల్ ద బెస్ట్` అంటూ మెచ్చుకుంటున్నారు. ఇదంతా తన కోచ్ వల్లే సాధ్యమైందని నిరాడంబరంగా జవాబిస్తున్నాడు మన చిన్నారి చెన్ యీ.