: పేకాటాడుతూ పట్టుపడ్డ పలాస మున్సిపల్ చైర్మన్!
శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపల్ చైర్మన్, టీడీపీ నాయకుడు కోత పూర్ణ చంద్రరావు జూదమాడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. పూర్ణ చంద్రరావు సహా పదకొండు మందిని పోలీసులు అరెస్టు చేశారు. సోంపేట మండలంలోని బారువ రిసార్ట్స్ లో పూర్ణచంద్రరావు, మరికొంతమంది పేకాట ఆడుతుండగా పోలీసులు దాడి చేసినట్టు ఇన్ చార్జి సీఐ సన్యాసినాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు పక్కా సమాచారం రావడంతో రిసార్ట్స్ కి వెళ్లి దాడులు నిర్వహించామన్నారు. జూదరుల నుంచి రూ.45 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.