: అశ్లీల చిత్రాలు చూస్తూ బస్సు నడిపిన టీఎస్ ఆర్టీసీ డ్రైవర్!


టీఎస్ ఆర్టీసీ మినీ వజ్ర బస్సు డ్రైవర్ అశ్లీల చిత్రాలు చూస్తూ వాహనం నడిపాడంటూ సంబంధిత అధికారులకు ఓ ప్రయాణికుడు ఫిర్యాదు చేశారు. వరంగల్-2 డిపోకు చెందిన టీఎస్ 03 జెడ్ 0340 నెంబర్ గల వజ్ర బస్సు సర్వీసు నిన్న హైదరాబాద్ లోని కూకట్ పల్లికి వస్తున్న సందర్భంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ మేరకు జనగామ డిపోలో నాగలింగం అనే ప్రయాణికుడు ఫిర్యాదు చేశారు. వరంగల్ నుంచి బయలుదేరిన ఈ బస్సులో సదరు ప్రయాణికుడు ఇందులో ప్రయాణిస్తున్నాడు.

 బస్సు స్టేషన్ ఘన్ పూర్ దాటగానే కుదుపునకు లోనైంది. ఈ క్రమంలో నావిగేషన్ నిమిత్తం బస్సు డ్రైవర్ ఉపయోగిస్తున్న ట్యాబ్ లో నీలి చిత్రాలు చూస్తున్నట్టు నాగలింగం గమనించారు. వెంటనే, బస్సును ఆపించి, ఈ విషయమై డ్రైవర్ ని నిలదీయగా బుకాయించాడు. ఈ క్రమంలో ప్రయాణికులంతా కలసి బస్సును జనగామ డిపోకు తీసుకువెళ్లి, అధికారులకు ఫిర్యాదు చేశారు. ట్యాబ్ లో అశ్లీల చిత్రాలు చూస్తున్నాడనేందుకు ఆధారాలు దొరకడంతో డ్రైవర్ పై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ విషయమై సదరు ప్రయాణికుడు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.  
 

  • Loading...

More Telugu News