: ఎన్టీఆర్ ‘బిగ్‌బాస్’ షోలో పాల్గొంటున్న నటుల్లో కొందరి పేర్లు ఇవిగో!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ షోను ఈ నెల 16వ తేదీ నుంచి ప్రసారం చేయనున్నట్లు 'స్టార్ మా' చానెల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో మొత్తం 12 మంది సెలబ్రిటీలు పాల్గొంటుండగా వీరంతా 70 రోజుల పాటు ఒకే చోట కలిసి ఉంటారు. ఈ షో కోసం 70 కెమెరాలు అమర్చారు. ఇక ఇందులో పాల్గొనబోతున్న కొందరి పేర్లు బయటకు వచ్చాయి.
వారిలో సదా, స్నేహ, రంభ, మంచు లక్ష్మి ఉన్నారు. వీరంతా సినిమాల్లోనే కాక పలు టీవీ షోల్లో ఇప్పటికే కనిపిస్తోన్న విషయం తెలిసిందే. బిగ్‌బాస్ షోలో పాల్గొనేందుకు పలువురు సెలబ్రిటీలు నో చెప్పగా, మరికొందరు ఆసక్తి చూపారు. ఈ షో హిందీలో సూపర్ హిట్ కాగా, తమిళంలో ఈ మధ్యే ప్రారంభం అయింది. తెలుగులో ఏ మేరకు అలరిస్తుందో చూడాలి..