: బస్సులో మహిళకు ముద్దుపెట్టిన బీజేపీ నేత అరెస్ట్!


మహారాష్ట్రలో ఓ బీజేపీ నేత బ‌స్సులో ఓ మ‌హిళ‌కు ముద్దు పెట్టిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఓ వీడియో కూడా వైర‌ల్ అయింది. దీంతో ముంబైకి చెందిన స‌ద‌రు బీజేపీ నేత రవీంద్ర బవన్‌థాడేపై బాధిత మ‌హిళ కేసు కూడా పెట్టింది. గద్‌చిరోలీ జిల్లాలోని చందాపూర్ ప్రాంతంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఆ మ‌హిళ నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ఈ రోజు ఆయ‌న‌ను అరెస్టు చేశారు. రవీంద్ర‌పై మహిళ గౌరవానికి భంగం కలిగించడం, ఆమెపై అత్యాచారం తదితర అభియోగాలను న‌మోదు చేశారు. ఆ మ‌హిళను ర‌వీంద్ర‌ బలవంతం చేయడానికి కూడా ప్రయత్నించినట్లు ఆ వీడియోలో రికార్డ‌యిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన బీజేపీ.. ర‌వీంద్ర‌ను గ‌తంలోనే పార్టీ నుంచి తొల‌గించి‌న‌ట్లు చెప్పింది.      

  • Loading...

More Telugu News