: అమెరికా వీసాలు ఇవ్వకుండా మోకాలొడ్డినా... ఆఫ్గన్ అమ్మాయిలకు మరో అవకాశం!
తమలోని వినూత్న ప్రతిభను కనబరుస్తూ, బాల్ సార్టింగ్ రోబోటిక్ యంత్రాన్ని తయారు చేసి, అమెరికాలో జరిగే పోటీల్లో పాల్గొనాలని భావించి, వీసాల నిరాకరణకు గురైన ఆఫ్గన్ అమ్మాయిలకు అవకాశం మరో రూపంలో స్వాగతం పలికింది. వీరి విషయం తెలుసుకున్న పోటీల నిర్వాహకులు, స్కైప్ ద్వారా ఆన్ లైన్లో పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం ఇస్తున్నట్టు తెలిపింది. ఈ విషయాన్ని ఫస్ట్ గ్లోబల్ కంపెనీ ప్రెసిడెంట్ జోయే సెస్టాక్ ఫేస్ బుక్ ఖాతాలో వెల్లడించారు. అమెరికా తీసుకున్న నిర్ణయం విచారకరమని, అయితే ఆఫ్గన్ అమ్మాయిలు స్కైప్ వీడియో లింక్ ను వాడుకుని తమ హెరత్ పట్టణం నుంచే పోటీ పడవచ్చని స్పష్టం చేశారు. వీరి కథనాన్ని వాషింగ్టన్ పోస్ట్ ప్రపంచం దృష్టికి తీసుకురాగా, పలువురు అమెరికా వైఖరిని తప్పుబట్టిన సంగతి తెలిసిందే.