: మీకు దెయ్యాలంటే భయమా?... ఈ ముగ్గురికి మాత్రం చాలా భయం: అక్కినేని నాగార్జున
అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో ఓంకార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘రాజుగారి గది 2’ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఈ హారర్ థ్రిల్లర్‌లో యువ నటులు సమంత, సీరత్ కపూర్, అశ్విన్, నరేశ్, వెన్నెల కిశోర్, ప్రవీణ్ కూడా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేయాలని ఈ సినిమా యూనిట్ భావిస్తోంది. కాగా, ఈ సినిమాలో నటిస్తోన్న పలువురి పాత్రల గురించి నాగార్జున క్లూ ఇచ్చారు. ‘మీకు దెయ్యాలంటే భయమా?... ఈ ముగ్గురికి మాత్రం భయం’ అంటూ నాగార్జున తన ట్విట్టర్ ఖాతాలో ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ముగ్గురు నటులను నాగార్జున భయపెడుతున్నట్లు ఈ ఫొటో ఉంది. దీంతో ఈ సినిమాలో సదరు నటులు దెయ్యం అంటే వణికిపోతూ కడుపుబ్బా నవ్విస్తారని తెలుస్తోంది.