: సాయంత్రం 6 తరువాత యూనివర్సిటీలో ఉండాలంటే అనుమతి తప్పని సరి: లక్నో వర్సిటీ వీసీ కొత్త నిబంధన


సాయంత్రం 6 గంటల తరువాత క్యాంపస్ తో పాటు యూనివర్సిటీలోని కార్యాలయాల్లో మహిళలు ఉండాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలని ఉత్తరప్రదేశ్, లక్నోలోని బాబాసాహెబ్ భీమ్ రావు అంబేద్కర్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీ ఆర్సీ సోబ్తీ సంచలన ఆదేశాలు జారీ చేశారు. సాధారణంగా యూనివర్సిటీల్లో పరిశోధనలు చేసే వారు, లైబ్రరీ, ప్రయోగశాలలు వంటి వాటిల్లో సాయంత్రం 8 గంటల వరకు గడుపుతుంటారు.

అయితే మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకుని సాయంత్రం 6 గంటలవరకే మహిళలు క్యాంపస్, కార్యాలయాల్లో ఉండాలని సదరు వీసీ సూచించారు. అంతకు మించిన సమయం గడపాలంటే ముందుగా తన అనుమతి తీసుకోవాలని ఆయన సూచించారు. ఎవరైనా విద్యార్థిని ల్యాబ్ లో సాయంత్రం 6 తరువాత పని చేయాల్సి ఉంటే హెచ్వోడీ (హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ ) అనుమతి తీసుకోవాలని ఆయన తెలిపారు. దీనిపై ఉద్యోగులు, విద్యార్థుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భద్రత పేరిట కోటి రూపాయలకుపైగా ఖర్చుచేసి సీసీకెమెరాలు ఏర్పాటుచేసి, ఇప్పుడీ కొత్త నిబంధనలు ఏంటని ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News