: ఇజ్రాయెల్ ప్రధానికి అపురూపమైన కానుకలు ఇచ్చిన మోదీ!
ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీకి అక్కడ అసాధారణమైన అతిథి మర్యాదలు లభిస్తున్నాయి. భారత ప్రధానిని తమకు అత్యంత నమ్మకమైన నేస్తంగా ఇజ్రాయెల్ గౌరవిస్తోంది. ఈ సందర్భంగా, ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహుకు మోదీ అపురూపమైన కానుకలు అందజేశారు. భారత్ లో అలనాటి యూదుల చరిత్రకు సంబంధించిన కళాఖండాలను బహూకరించారు.
వీటిలో మొదటిది కేరళలోని కొచ్చిన్ లో యూదుల చరిత్రను తెలిపే రాగిపలకల ప్రతిరూపం. రెండోది భారత్ లోని యూదుల వ్యాపారాలను తెలిపే డాక్యుమెంట్ తో కూడిన రాగిపలకల ప్రతిరూపం. వీటితో పాటు కేరళలో ఉన్న పరదేశి యూదుల సంఘం విరాళంగా ఇచ్చిన తోరా, బంగారంతో పూత పూసిన కిరీటాన్ని కూడా నెతన్యాహుకు మోదీ బహూకరించారు. ఈ బహుమతులతో ఇజ్రాయెల్ అధినేత పరమానందభరితులయ్యారు.