: పళనిస్వామికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు


తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. విశ్వాస పరీక్షలో నెగ్గేందుకు ఎమ్మెల్యేలకు ముడుపులు చెల్లించారనే ఆరోపణలు పళనిపై వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. కేసును విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.... అసెంబ్లీలో అవిశ్వాస పరీక్ష జరిగిన తీరును పరిశీలించేందుకు అనుమతినిచ్చింది.

బలపరీక్ష సందర్భంగా ఎమ్మెల్యేలకు భారీ ఎత్తున బంగారం, డబ్బును పంచినట్టు ఓ స్టింగ్ ఆపరేషన్ లో కూడా బయటపడింది. ఒకానొక దశలో ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 4 కోట్లు ఇచ్చేందుకు కూడా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ సిద్ధపడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ డీఎంకే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

  • Loading...

More Telugu News