: ఇంకా పాత నోట్లున్నాయా? 15 రోజుల్లో మరో చాన్స్... ఏర్పాట్లు చేస్తున్న కేంద్రం!


ఏవైనా అనివార్య కారణాలతో పాత నోట్లను మార్చుకోలేక పోయారా? అయితే మీకోసం మరో చాన్స్ రానుంది. నిన్న సుప్రీంకోర్టు చేసిన సూచనలతో మెత్తబడ్డ కేంద్ర ప్రభుత్వం మరోసారి నోట్లను మార్చుకునేందుకు అవకాశం ఇవ్వనుంది. మరో రెండు వారాల్లో అన్ని బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా పాత నోట్లను మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తూ, కేంద్రం ఆదేశాలు జారీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వానికి రెండు వారాల సమయం ఇస్తే, ఓ నిర్ణయానికి వస్తామని, మంగళవారం నాడు సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ అత్యున్నత ధర్మాసనానికి తెలిపిన సంగతి విదితమే.

  • Loading...

More Telugu News