: తప్పు చేసిన జగన్ జైలుకే... నేడు కాకుంటే రేపు: చంద్రబాబు


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తీవ్రమైన తప్పులు చేశారని, అతనికి శిక్ష తప్పదని, అయితే, అది నేడు కాకుంటే రేపు జరుగుతుందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంలో ఉన్న శూన్యతను సద్వినియోగం చేసుకోవాలని ప్రజా ప్రతినిధులకు సూచించిన ఆయన, ప్రజల్లోకి వెళ్లి, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను గురించి మరింత ప్రచారం చేసి, వారిని పార్టీ వైపు తిప్పుకోవాలని సూచించారు.

 ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పని చేపట్టినా, వైకాపా అడ్డుతగులుతోందని వ్యాఖ్యానించిన ఆయన, చివరికి జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులకు నీరు ఇస్తున్నా అడ్డుపుల్లలు వేయాలని చూస్తున్నారని నిప్పులు చెరిగారు. గాలేరు - నగరి పనులకు, కర్నూలు విమానాశ్రయానికి, అమరావతి నిర్మాణానికి ఆ పార్టీ అడ్డుపడుతోందని ఆరోపించారు. కాలంతో పాటు విధానాలు మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఒకప్పుడు జనాభా నియంత్రణను ప్రోత్సహించిన తాను, ఇప్పుడు మారానని, దేశం కోసం యువతరం, పెద్దలు సమానంగా ఉండాల్సిన అవసరం ఉందని, అందుకోసం మరింత మంది పిల్లల్ని కనాలని సూచించారు.

  • Loading...

More Telugu News