: అప్పుడు ఆత్మహత్య చేసుకోవడమే బెటర్ అనుకున్నా.... అందుకే ఆగాను!: మెగా బ్రదర్ నాగబాబు
'ఆరెంజ్' సినిమా తరువాత నాగబాబు పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయారు. అప్పటి పరిస్థితులను తాజాగా గుర్తు చేసుకున్న ఆయన మాట్లాడుతూ, అవి తన జీవితంలో గడ్డు రోజులని అన్నారు. అత్యంత దుర్భరమైన పరిస్థితులని ఆయన చెప్పారు. లక్ష రూపాయల అద్దె ఇంటి నుంచి 20,000 రూపాయల అద్దె ఇంటికి మారిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తన పరిస్థితి ఇలా మారిపోయిందేంటా? అని తనపై తానే జాలిపడేవాడినని చెప్పారు.
అన్నయ్యను అడగలేక, తమ్ముడికి చెప్పలేక తీవ్రమానసిక సంఘర్షణను అనుభవించానని, ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా భావించానని గుర్తు చేసుకున్నారు. బతికేందుకు కారణాలు కూడా కనిపించలేదని ఆయన చెప్పారు. అయితే ఆత్మహత్య ఆలోచనతో తమ కుటుంబం గుర్తుకొచ్చిందని, భార్యా బిడ్డలతో పాటు, అన్నయ్య, తమ్ముడు పరిస్థితి కూడా గుర్తొచ్చిందని పేర్కొన్నారు. అన్నదమ్ముల గౌరవం, పరువు మంటగలిసిపోతాయని వెనకడుగు వేశానని, ఆ తరువాత అన్నయ్య, తమ్ముడు ఇచ్చిన ఆసరాతోనే నిలదొక్కుకున్నానని గతాన్ని గుర్తు చేసుకున్నారు.