: నార్త్ కొరియా ప్రయోగించినది మధ్యంతర శ్రేణి క్షిపణి.. ఖండాంతర క్షిపణి కాదు.. తేల్చిచెప్పిన రష్యా


ఉత్తర కొరియా మంగళవారం ప్రయోగించిన క్షిపణి ఖండాంతర క్షిపణి (ఐసీబీఎం) కాదని, అది మధ్యంతర శ్రేణి క్షిపణి మాత్రమేనని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తేల్చిచెప్పింది. నార్త్ కొరియా ప్రయోగించిన మిసైల్  510 కిలోమీటర్ల ఎత్తులో 535 కిలోమీటర్లు ప్రయాణించి జపాన్ సముద్రంలో కూలిందని పేర్కొంది. ఆ క్షిపణి వల్ల రష్యాకు వచ్చిన నష్టమేమీ లేదని తెలిపింది. ఉత్తర  కొరియా భూభాగం నుంచి క్షిపణి పరీక్ష జరగనున్నట్టు రష్యా మిసైల్ వార్నింగ్ సిస్టం ముందుగానే గుర్తించిందని మిలటరీ అధికారులు తెలిపారు.

కాగా, మంగళవారం క్షిపణి ప్రయోగం తర్వాత  తాము తొలిసారి ఖండాంతర క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్టు నార్త్ కొరియా పేర్కొంది. హ్వాసాంగ్-14 ఐసీబీఎం క్షిపణి 39 నిమిషాల్లో 2,802 కిలోమీటర్ల ఎత్తులో 933 కిలోమీటర్లు ప్రయాణించిందని ఉత్తర కొరియా అధికారిక టెలివిజన్ పేర్కొంది.

  • Loading...

More Telugu News