: ఉత్తర కొరియా తాజా ప్రయోగం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన నిపుణులు
తమ జోలికి వస్తే అంతా సర్వ నాశనం చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తూ వరుసగా క్షిపణుల ప్రయోగాలు చేస్తోన్న ఉత్తరకొరియా ఈ రోజు అమెరికాను చేరుకోగల ఖండాంతర క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా చేసిన విషయం తెలిసిందే. ఆ క్షిపణి తూర్పు సముద్రంలోని తమ ప్రత్యేక ఆర్థిక మండలిలో పడినట్లు, అందుకు సంబంధించిన ఆనవాళ్లు లభ్యమయ్యాయని జపాన్ తెలిపింది. ఉత్తరకొరియా తాజా ప్రయోగం పట్ల నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆ దేశం అలస్కాను చేరుకోగల సామర్ధ్యమున్న ఖండాంతర క్షిపణి టెక్నాలజీని సాధించిందని అంటున్నారు. ఇక అమెరికాలోని కీలక రాష్ట్రాలను చేరుకునే క్షిపణులను తయారు చేయడం ఆ దేశానికి సులభతరం అవుతుందని అంటున్నారు.