: సినీ రంగంలో డ్రగ్స్ వాడకం ఉంది: పోసాని కృష్ణ మురళి
సినీ రంగంలోని వ్యక్తులు డ్రగ్స్ వాడటం నిజమేనని ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అన్నారు. అయితే, చాలా తక్కువ మందే వీటిని తీసుకుంటున్నారని... వీరి సంఖ్య కంట్లో నలుసు అంత ఉంటుందని చెప్పారు. కేవలం ఒకరు, ఇద్దరి వల్ల మొత్తం పరిశ్రమకే చెడ్డ పేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరో ఒకరు చేసిన పనికి, పరిశ్రమ మొత్తాన్ని తప్పుపట్టడం భావ్యం కాదని అన్నారు. డ్రగ్స్ బారిన పడి ఎంతో మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని... డ్రగ్స్ తీసుకునే వ్యక్తి వల్ల మొత్తం కుటుంబమే నాశనమవుతుందని చెప్పారు. డ్రగ్స్ ను తాను కేవలం టీవీలు, పేపర్లలో మాత్రమే చూశానని... ప్రత్యక్షంగా ఇంతవరకు చూడలేదని తెలిపారు. ప్రత్యేక సందర్భాల్లో తప్ప తాను రెగ్యులర్ గా మద్యం కూడా ముట్టనని చెప్పారు.