: నేను ఏ పార్టీకీ చెందిన వాడిని కాదు: రామ్ నాథ్ కోవింద్
తనను ఎన్డీఏ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో రామ్‌నాథ్ కోవింద్ ఏపీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో పాటు టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రామ్‌నాథ్ కోవింద్ మాట్లాడుతూ... తెలుగువారు ఎన్టీఆర్‌ని అవతార పురుషుడిగా భావిస్తారని విన్నానని అన్నారు. తెలుగువారికి ఎన్టీఆర్ గర్వకారణమని కొనియాడారు. ఎన్డీఏ, ప్రధాని మోదీతో పాటు తనకు మద్దతు ఇస్తోన్న పార్టీలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆయన అన్నారు. తాను బీహార్ గవర్నర్‌గా పార్టీలకు అతీతంగా పనిచేశానని చెప్పారు. తాను ఏ రాజకీయ పార్టీకి చెందినవాడిని కాదని వ్యాఖ్యానించారు.