: అమ్మాయిలను కూడా మందు తాగమంటారా?: మంత్రి జవహర్ పై రోజా ఫైర్


బీర్ ను హెల్త్ డ్రింక్ అని పేర్కొన్న ఏపీ మంత్రి జవహర్ పై రోజా నిప్పులు చెరిగారు. ప్రభుత్వ చర్యలను చూస్తుంటే రానున్న రోజుల్లో విద్యార్థులతో కూడా బీరు తాగించేలా ఉన్నారని ఆమె మండిపడ్డారు. అమ్మాయిలను కూడా మందు తాగమంటారా? అని ప్రశ్నించారు. స్కూళ్లు, గుళ్ల మధ్య వైన్ షాపులను వైసీపీ అంగీకరించదని చెప్పారు. కాగా, హెరిటేజ్ వ్యాన్ లో ఎర్రచందనం దుంగలు వెళుతున్నాయని రోజా తీవ్ర ఆరోపణలు చేశారు. ఎర్ర చందనాన్ని అమ్మే హెరిటేజ్ ను అభివృద్ధి చేశారా? అని ప్రశ్నించారు. నారావారిపల్లెలో ఉన్న చంద్రబాబు పొలంలో కూడా ఎర్రచందనం దుంగలు దొరికాయని అన్నారు. 

  • Loading...

More Telugu News