: బస్సులో మహిళకు ముద్దు పెట్టిన మహారాష్ట్ర బీజేపీ నేత!
మహారాష్ట్రలో ఓ బీజేపీ నేత బస్సులో ఓ మహిళకు ముద్దు పెట్టాడు. ఇందుకు సంబంధించిన దృశ్యం కెమెరా కంటికి చిక్కడంతో ఆ నేత చిక్కుల్లో పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే, ముంబైకి చెందిన బీజేపీ నేత రవీంద్ర బవన్‌థాడే ఇటీవల ఓ బస్సులో అందరితో కలిసి ప్రయాణిస్తున్నాడు. గద్‌చిరోలీ జిల్లాలోని చందాపూర్ ప్రాంతంలోకి బస్సు రాగానే అందులోని ఓ మహిళకు ముద్దు పెట్టాడు. ఆ మహిళతో ఆయనకు ఇంతకు ముందే పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. తాజా ఘటన అనంతరం ఆ మహిళ సదరు నేతపై కేసు పెట్టింది. అప్పటి నుంచి రవీంద్ర కనిపించకుండా పోయాడు. తనకు రవీంద్ర ఉద్యోగం ఇస్తానని చెప్పాడని, పెళ్లి కూడా చేసుకుంటానని అన్నాడని ఆ మహిళ చెప్పింది.