: ముందు ఆయనను డబ్బులు కట్టనివ్వండి చూద్దాం: 'సదావర్తి'పై స్పందించిన చంద్రబాబు
అదనంగా రూ. 5 కోట్లు కట్టి 83 ఎకరాల సదావర్తి సత్రం భూములను తీసుకోవచ్చంటూ, తెలుగు రాష్ట్రాల హైకోర్టు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పందించారు. వేలంలో వచ్చిన మొత్తం కన్నా 5 కోట్ల రూపాయలు ఎక్కువ ఇచ్చి భూములను తీసుకోవచ్చని ఎన్నో రోజుల క్రితమే తాను స్పష్టం చేశానని, ఇప్పటికీ దానికే కట్టుబడి వున్నామని తెలిపారు. డబ్బులు కడితే తనకు సంతోషమేనని, ముందు కట్టనివ్వండి చూద్దామని ఆయన అన్నారు.
ఈ కేసులో వేల కోట్ల విలువైన భూమిని అప్పనంగా కట్టబెట్టారని ఆళ్ల ఆరోపించగా, ఇంకాస్త ఎక్కువిస్తే, వేలాన్ని రద్దు చేసి, ఆ భూమిని ఎవరికైనా ఇస్తామని ఏపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. కాగా, 83 ఎకరాల భూమికి వేలంగా రూ. 22.44 కోట్లు రాగా, దానికి అదనంగా రూ. 5 కోట్లను కలిపి రూ. 27.44 కోట్లను చెల్లించడానికి న్యాయస్థానం ఆళ్ల రామకృష్ణారెడ్డికి నాలుగు వారాల సమయం ఇచ్చిన సంగతి తెలిసిందే.