: ఆ భయంతోనే దేశం వదిలి వెళ్లిపోయా: ఇలియానా


తనకు తెలుగు, హిందీ భాషలు అస్సలు రావని... అందుకే సెట్స్ లో ఎక్కువగా ఇంగ్లీష్ లోనే మాట్లాడేదాన్నని హీరోయిన్ ఇలియానా తెలిపింది. తన తొలి నాళ్లలో సినిమా ప్రమోషన్లలో మీడియా ప్రతినిధులు తనను హిందీలో మాట్లాడమని కోరేవారని... అప్పుడు చాలా భయమేసేదని చెప్పింది. ఆ భయంతోనే మూడు వారాల పాటు ఇండియాను వదిలి వెళ్లిపోయానని... కొన్ని రోజులు తనను ఒంటరిగా వదిలేయమని దర్శకులకు చెప్పేదాన్నని తెలిపింది. అయితే అభిమానులు తనను ఇంతగా ఆదరిస్తారని మాత్రం తాను ఊహించలేదని చెప్పింది.

ప్రస్తుతం తాను బాలీవుడ్ పైనే ఎక్కువగా ఫోకస్ చేశానని... తన తాజా చిత్రం 'ముబారకన్'లో తాను పంజాబీ అమ్మాయిగా కనిపిస్తానని ఇల్లీ తెలిపింది. దక్షిణాది చిత్ర రంగంలో తాను అక్షయ్ కుమార్ లాంటిదాన్నని... ఆయన మాదిరే తాను కూడా ఏడాదికి నాలుగు చిత్రాలు చేసేదాన్నని చెప్పింది. తెలుగులో అందరు అగ్ర హీరోలతో చేశానని... తనకు నచ్చిన నటుల్లో రవితేజ ఒకడని తెలిపింది. 

  • Loading...

More Telugu News