: నిజం చెప్పిన మంత్రి జవహర్ పై ఈ నిందలేంటి? సోషల్ మీడియాలో వినూత్న ఎద్దేవా?


"బీరు ఓ హెల్త్ డ్రింక్"... ఏపీ ఎక్సైజ్ మంత్రి జవహర్ చేసిన వ్యాఖ్య ఇది. ఈ వ్యాఖ్య పెను దుమారాన్నే రేపగా, ఇప్పటికే జనావాసాల్లో మద్యం దుకాణాలు వద్దని నిరసనలు తెలియజేస్తున్న మహిళా సంఘాలు ఉవ్వెత్తున ఎగసి, జవహర్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపడుతుండగా, ఆయనకు మద్దతుగా నెట్టింట పలు రకాల వ్యాఖ్యలు వస్తున్నాయి. ఇవన్నీ జవహర్ వైఖరిని ఎద్దేవా చేస్తున్నాయి.

"పచ్చి నిజం చెప్పిన జవహర్ పై ఈ కోపమెందుకు?" అని ఓ యువకుడు ప్రశ్నించగా, "ఆయన రోజూ హెల్త్ డ్రింక్ తాగుతారేమో?" అని మరో వ్యక్తి, "ఇక బీరును మద్యం షాపుల్లో కాకుండా, సాధారణ కిరాణా దుకాణాల్లో కూడా అమ్మాల్సిందే" అని మరొకరు వ్యాఖ్యానించారు. బీరుపై ఉండే 'మద్యపానం హానికరం' హెచ్చరికను తొలగించాలని, అందుకు తగ్గ ఆదేశాలను ఎక్సైజ్ మంత్రిగా జవహరే జారీ చేయాలని కూడా కొందరు అంటున్నారు. ఇక తనపై వస్తున్న ఈ ఎద్దేవా వ్యాఖ్యలపై జవహర్ ఏమంటారో?!

  • Loading...

More Telugu News